బాజన్ చెరువు కట్టను పరిశీలించిన రైతులు

KMR: బీర్కూరు శివారులో గల బాజన్ చెరువు కట్టను సోమవారం రైతులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్టపై మట్టి జారుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు చెరువు కట్టను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. చెరువు కట్టపై మట్టి, మొరం వేసి బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అన్నదాతలు కోరారు.