VIDEO: కొండగట్టు శ్రీ అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ
JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాగా, చిన్న జయంతి సమీపిస్తున్నందున అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.