VIDEO: కారులో చెలరేగిన మంటలు
HYD: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆగి ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.