VIDEO: ప్రతి అర్జీని పరిష్కరించాలి: కలెక్టర్
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అర్జీలను స్వీకరించి, ప్రతి సమస్యను అధికారులు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.