హోంగార్డులను అభినందించిన జిల్లా ఎస్పీ

VZM: ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో సివిల్ కానిస్టేబుళ్లు ఎంపికైన విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు హోంగార్టులను శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తమ కార్యాలయానికి పిలిపించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు పోలీసు శాఖలో హోం గార్హులుగా పని చేస్తూ, వివిధ రకాలైన పోలీసు విధులను సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు.