నేటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక ఆధార్ శిబిరం
MNCL: జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి గ్రామపంచాయతీలో ఈ నెల 9, 10, 11 తేదీలలో ప్రత్యేక ఆధార్ శిబిరం నిర్వహిస్తున్నట్లు పోస్టల్ శాఖ ASP రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ఆధార్ కార్డుల తప్పుల సవరణ, ఫొటో అప్డేట్, చిరునామా మార్పు, ఫోన్ నంబర్ లింక్, పుట్టిన తేదీ మార్పు వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సమీప గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.