మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ నిరసన ర్యాలీ

మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైసీపీ నిరసన ర్యాలీ

AKP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ బుధవారం నిర్వహించారు. అబిడ్స్ సెంటర్ నుంచి శ్రీ కన్య జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో భారీ ఎత్తున వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.