పాము కాటుతో మాజీ సర్పంచ్ మృతి

పాము కాటుతో మాజీ సర్పంచ్ మృతి

VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం మాజీ గ్రామ సర్పంచ్ మీసాల తులసి (54) బుధవారం పాముకాటుతో మృతి చెందాడు. ఆయన రాత్రి ఇంట్లోని పూల మొక్కల వద్ద పాము కాటుకు గురయ్యారు. వైద్య చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య తులసి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.