డ్రోన్ కెమెరాలతో వరి పంటల పరిశీలన

డ్రోన్ కెమెరాలతో వరి పంటల పరిశీలన

NTR: మొంథా తుఫాన్ నేపథ్యంలో దెబ్బతిన్న పంట పొలాలను డ్రోన్ కెమెరాతో తిరువూరు ఆర్డీవో కే.మాధురి పరిశీలించారు. గంపలగూడెం మండలంలో గొల్లపూడి గ్రామంలో వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా, రైతులతో మమేకమై, పంట దెబ్బతిన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనాలు తయారు చేసి అందరికీ పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.