టీడీపీ నేత మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

GNTR: మాచర్ల 28వ వార్డు నాగిరెడ్డి బజారుకు చెందిన టీడీపీ నాయకుడు పూలకొట్టు షేక్ రబ్బాని శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మరణంపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.