13 కొనుగోలు కేంద్రాల ద్వారా సోయాబీన్ సేకరణ

13 కొనుగోలు కేంద్రాల ద్వారా సోయాబీన్ సేకరణ

NRML: జిల్లాలో 13 కొనుగోలు కేంద్రాల ద్వారా సోయాబీన్ సేకరణ కొనసాగుతున్నట్టు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు కొనుగోలు పరిమితిని 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచిందన్నారు. రైతులు సోయాబీన్‌ను 12% తేమ ఉండేలా ఎండబెట్టి ప్రభుత్వ మద్దతు ధర రూ. 5,328 ప్రతి క్వింటాల్‌కి విక్రయించాలని కోరారు.