నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

NDL: బేతంచెర్ల మండలం సీతారామపురం, సంకలాపురం గ్రామాల్లో ఈ రోజు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు టీడీపీ బేతంచర్ల మండల కన్వీనర్ నాగయ్య వెల్లడించారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయడంతో పాటు, శస్త్ర చికిత్సలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని పేర్కొన్నారు.