అంగన్వాడీ స్థలంలో అక్రమ నిర్మాణం
KMR: నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ఆనుకొని ఓ వ్యక్తి అక్రమంగా నిర్మాణం చేపట్టాడు. అంగన్వాడీ స్థలంలో ఓ వ్యక్తి అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని వెంటనే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల ఆదేశించిన ఫలితం లేకుండా పోతుందని స్థానికులు అంటున్నారు.