ఘనంగా బీడీ శర్మ వర్ధంతి వేడుకలు
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో పేసా చట్టం రూపకర్త, ఆదివాసీ హక్కుల పోరాటయోధుడు బీడీ శర్మ వర్ధంతి వేడుకలు ఇవాళ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పూనేం సందీప్, ప్రధాన కార్యదర్శి మల్లెల సారయ్య నేతృత్వంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీలకు స్వయం పాలన అందించిన బీడీ శర్మను స్మరించుకున్నారు.