మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం

VZM: మాదక ద్రవ్యాలతో ఆరోగ్యం క్షీణించి జీవితాలు నాశనం అవుతాయని వాటికి దూరంగా ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు వలన కలిగే అనార్దలపై విసృతంగా అవగాహన కల్పించాలన్నారు.