'కోతుల నుంచి విముక్తి కల్పించాలి'

KMM: మధిర మున్సిపాలిటీతో పాటు విలీన గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, కోతుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ సుమంత్ కోరారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కోతులు గుంపులుగా ఇళ్లల్లోకి చేరుతున్నాయని, వన్యప్రాణి చట్టం ప్రకారం కోతులను పట్టించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.