వైద్య విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్థిక భరోసా
MBNR: ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో వైద్య విద్యార్థి లోకేష్‌కు రూ. 50 వేల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థిని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.