అయోధ్య రాముడికి పట్టు వస్త్రాల సమర్పించిన టీటీడీ ఛైర్మన్

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ తరఫున తొలిసారిగా బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ పాల్గొన్నాడు. ఇకపై ప్రతియేటా టీటీడీ తరఫున బాలరాముడికి పట్టువస్త్రాలు అందిస్తామని బీఆర్ నాయుడు తెలిపాడు.