ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన అరకు ఎమ్మెల్యే
ASR: ముంచంగిపుట్టు మండలం కిలగాడ గిరిజన సంక్షేమ బాలుర, బంగారుమెట్ట బాలికల ఆశ్రమ పాఠశాలలను మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వేరు వేరుగా తనిఖీ చేశారు. ముందుగా ఆయా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.