మున్సిపల్ కార్యాలయంలో ప్రకాశం పంతులు జయంతి

BPT: బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. పురపాలక సంఘ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.