రైతన్న కష్టాలపై కన్నీరు పెట్టిస్తున్న చిన్నారుల స్కిట్..!
HYDలో ఓ పాఠశాలలో రైతన్న కష్టాలపై చిన్నారులు వేసిన స్కిట్ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. కనీసం విత్తనాలు కొనేందుకు పైసల్లేక రైతన్న చేసే అప్పులు, పంట పండించడంలో తాను పడే కష్టం, మరోవైపు కుటుంబ బాధ్యతల నడుమ ఈ స్కిట్ సాగుతుంది. హఠాత్తుగా వచ్చిన భారీ వర్షంతో పంట దెబ్బతిని రైతన్న తీవ్రంగా నష్టపోతాడు. ఆ సమయంలో రైతన్న పడ్డ బాధ గుండెలను కదిలించింది.