తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ

CTR: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కొప్పేడు దళితవాడ అంగన్వాడీ కేంద్రం వద్ద అవగాహన ర్యాలీ శుక్రవారం చేపట్టారు. ర్యాలీ ఈ నెల 7వ తేదీ వరకు మండలంలోని పంచాయతీల వారిగా నిర్వహించనున్నట్లు పర్యవేక్షకురాలు శ్యామల తెలిపారు. తల్లి పాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.