మంత్రి లోకేశు కలిసిన గుంటూరు మేయర్

GNTR: మంత్రి లోకేశ్‌ను ఉండవల్లిలోని తన స్వగృహంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నాని బుధవారం కలిశారు. మేయర్ పదవికి తగిన న్యాయం చేయాలని, శక్తి వంచన లేకుండా కృషి చేయాలని లోకేశ్ అన్నారని నాని చెప్పారు. నగరాభివృద్ధికి సంబంధించి పలు ప్రణాళికలు మంత్రికి వివరించానని, సత్వరమే వాటి అమలుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు.