మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన సీపీ
WGL: మొబైల్ ఫోరెన్సిక్ వాహనం నిందితులను గుర్తించడంతో పాటు, ఘటన స్థలంలో సాక్ష్యాధారాలను సేకరించడంలో మెరుగైన సేవలు అందిస్తుందని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కమిషనరేట్‌కు రెండవ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసింది. ఈ వాహనాన్ని సీపీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు.