వైభవంగా అప్పన్న తిరువీధి పల్లకి సేవ

వైభవంగా అప్పన్న తిరువీధి పల్లకి సేవ

VSP: సింహాచలంలోని వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి తిరువీధి పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించి పల్లకిలో ఉంచి, నాదస్వర, వేద మంత్రాలతో బేడా మండపంలో ఊరేగించారు. తిరువీధిలో భక్తులు భారీగా పాల్గొన్నారు.