సైబర్ నేరాల కేసులో మరో నలుగురు అరెస్ట్

సైబర్ నేరాల కేసులో మరో నలుగురు అరెస్ట్

VZM: జన్నారంలో జరిగిన సైబర్ నేరాల కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశామని మంచిర్యాల డీసీపీ ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్నారం సైబర్ కేసులో విజయనగరానికి చెందిన బి. జయవర్ధన్, ఎం. సింహాద్రి, పి.జగదీశ్, ఎల్.తేజాలను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.