పోచంపల్లిలో ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల సందడి

పోచంపల్లిలో ఫ్యాషన్ టెక్నాలజీ  విద్యార్థుల సందడి

BHNG: భూదాన్ పోచంపల్లోని చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు ముంబయిలోని శిష్మీర ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి 60 మంది ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు సోమవారం పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టూరిజం పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, చేనేత గృహాలను పరిశీలించారు. చేనేత కళాకారుల కళా నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు.