అడవి పందిని వేటాడి చంపిన వ్యక్తి అరెస్ట్
BDK: ములకలపల్లి మండలం పరిధిలోని మామిళ్లగూడెం అడవిలో వన్యప్రాణి వేట ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉచ్చులు పెట్టి అడవిపందిని వేటాడి చంపిన వ్యక్తిని అటవీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు బుధవారం వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ములకలపల్లి అటవీ రేంజర్ రవికిరణ్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు.