గిద్దలూరులో 650కి పైగా కేసుల పరిష్కారం

గిద్దలూరులో 650కి పైగా కేసుల పరిష్కారం

ప్రకాశం: గిద్దలూరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో 650కి పైగా కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భార్యా భర్తల గొడవలు, ఇతర కేసులు న్యాయవాదుల సమక్షంలో పరిష్కరించారు. లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అంతిమమని, దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదని న్యాయమూర్తి భరత్ చంద్ర తెలిపారు.