శివరాం ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

KMM: మధిర మండలం సిరిపురంలో ఇటీవల మరణించిన శివరాం ప్రసాద్ కుటుంబాన్ని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా శివరాం ప్రసాద్ చిత్రపటానికి మంత్రి పూలమాలతో నివాళులర్పించారు. శివరాం ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.