మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: దళారులకు తక్కువ ధరలకు ఇచ్చి రైతులు నష్టపోకుండా, మొక్కజొన్నను బాగా ఆరబెట్టి, పీఏసీఎస్ సెంటర్‌లో క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధరకు అమ్మి అధిక ఆదాయం పొందాలని ఎమ్మెల్యే విజయుడు అన్నాడు. మంగళవారం అలంపూర్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించాడు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.