VIDEO: తొలి విడత పోలింగ్ ప్రారంభం
KMM: తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.