'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'
ASF: ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 120 మైక్రాన్ల లోపు పాలిథిన్ కవర్లను ప్రభుత్వం నిషేధించిందన్నారు. వ్యాపారులు వాడితే జరిమానా విధిస్తామని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపార సంస్థలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. త్వరలో పూర్తి స్థాయిలో తనిఖీలు చెప్పడతామని పేర్కొన్నారు.