టమోటా మండి యజమానిపై ఫిర్యాదు

టమోటా మండి యజమానిపై ఫిర్యాదు

CTR: టమోటా మండి యజమాని తమకు మోసం చేశారంటూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సెమీపతికి సోమవారం రైతులు ఫిర్యాదు చేశారు. సోమల మండలం మఠం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పండించిన టమోటాను పుంగనూరు మార్కెట్ యార్డ్‌లో మండి యజమాని హరినాథ్ రెడ్డికి విక్రయించామని చెప్పారు. నెలలు గడుస్తున్నా తమకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు ఇంతవరకు చేతికి ఇవ్వలేదని వాపోయారు.