'యూరియా కోసం రైతుల కష్టాలు.. నిద్రమత్తులో ప్రభుత్వం'

NLG: యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏమి పట్టినట్టు చూడటం దుర్మార్గమైన చర్యని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. మంగళవారం నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో,యూరియా కోసం క్యూ లైన్‌లో ఉన్న రైతులు దగ్గరికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.