VIDEO: జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన మంత్రి
W.G: పాలకొల్లులో నూతన నటీనటులకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించారు. దీనిని మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణలో చేరేవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరి రామ జోగయ్య, సినీ నటుడు సారిక రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ పాల్గొన్నారు.