తిరుపతి గంగమ్మ గుడికి ఆర్థిక సాయం
TPT: తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ గుడి అభివృద్ధికి TTD ముందుకొచ్చింది. రూ. 2.50 కోట్లు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. TTD ఆర్థిక సాయానికి అనుమతి ఇచ్చింది. ముఖమండపం, ప్రాకారం సహా పలు నిర్మాణాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు.