'వైద్యులు అప్రమత్తంగా ఉండాలి'

SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల బుధవారం తెలిపారు. అన్ని రకాల మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.