ఆల్ ఇండియా ర్యాంకుతో మెరిసిన జిల్లా వాసి
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామానికి చెందిన బైరు శ్రావణ్ కుమార్ నిన్న ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాల్లో ఆల్ ఇండియా 7,078వ ర్యాంకు, ఓబీసీలో 2,837వ ర్యాంకు సాధించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఉద్యోగం సాధించిన శ్రావణ్ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు.