'టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి'

'టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి'

ATP: టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. అనంతపురంలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పంటను మార్కెట్‌కు తరలించే సమయంలో దళారులు గ్రూపులుగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళారులు నిర్ణయించిన ధరకే వేలం పాడాలంటూ హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు.