శ్రీశైలం రూట్లో ట్రాఫిక్ డైవర్షన్: సీపీ సుధీర్ బాబు

శ్రీశైలం రూట్లో ట్రాఫిక్ డైవర్షన్: సీపీ సుధీర్ బాబు

TG: గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెయ్యి సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజుల తర్వాత ప్రజలకు అనుమతి ఉంటుందని చెప్పారు. సమ్మిట్ జరిగే రోజుల్లో శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అన్నారు.