నర్సింగాపూర్ లో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

నర్సింగాపూర్ లో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

రాజన్నసిరిసిల్ల: చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.