iBOMMA రవికి ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?
TG: iBOMMA రవికి సామాన్యులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు పెరిగిపోతుంటే, రూపాయి ఖర్చు లేకుండా సినిమాలు చూపించిన రవిని జనం సమర్ధిస్తున్నారు. తప్పు దారిలో వెళ్లినా.. నిర్మాతల దోపిడీకి అడ్డుకట్ట వేశాడని ప్రశంసిస్తున్నారు. రవిపై సినీ పరిశ్రమ మండిపడుతున్నా, అతన్ని శిక్షిస్తే ప్రజాగ్రహం ప్రభుత్వంపై పడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.