ఆయిల్ ఫామ్ రైతులకు అవగాహన సదస్సు

MLG: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసి అధిక దిగుబడులతో పాటు లాభాలను గడించడానికి రైతుల సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఆయిల్ ఫామ్ రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, రైతులు, తదతరులు పాల్గొన్నారు.