రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై

కృష్ణా: నందివాడ పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు ఎస్సై శ్రీనివాస్ ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. సామాజిక శాంతి భద్రతకు విఘాతం కలిగించే చర్యలు కొనసాగితే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఎస్ఐ స్పష్టం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, నేరచర్యలను పూర్తిగా మానుకోవాలని, సమాజానికి ఉపయోగపడే దిశగా నడవాలని సూచించారు.