తాడిపత్రి యువతికి 992 మార్కులు

తాడిపత్రి యువతికి 992 మార్కులు

ATP: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తాడిపత్రి యువతి సత్తా చాటారు. మండలంలోని తలారిచెరువు గ్రామానికి చెందిన వర్షిణి ఎంపీసీ గ్రూపులో 1000కి 992 మార్కులతో ప్రతిభ కనబరిచారు. యువతి హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివారు. కుమార్తెకు మంచి మార్కులు రావడంతో తల్లిదండ్రులు హరినాథ్ రెడ్డి, అనూషలు సంతోషం వ్యక్తం చేశారు.