నల్లమలలో మార్మోగుతున్న 'పీవర్.. పీవర్' అరుపులు
NGKL: అమ్రాబాద్ నల్లమల అడవుల్లో వేసవి రాకతో కామన్ హాక్-కుకూ సందడి మొదలైంది. గద్ద ఆకారంలో ఉండే ఈ పక్షి, "పీవర్.. పీవర్" అంటూ చేసే విలక్షణమైన అరుపులు అడవి అంతటా మార్మోగుతున్నాయి. పరభోజనం చేసే స్వభావం కలిగిన ఈ పక్షులు, ఇతర పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. ప్రస్తుతం ఈ ప్రకృతి దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.