ఎనిమిది కాళ్లతో వింత గొర్రెపిల్ల జననం
MHBD: కేసముద్రం మండలంలోని ఇంటికన్నె గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చల్లగొల్ల కట్టయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె ఇటీవల ఏకంగా ఎనిమిది కాళ్ల గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. సాధారణంగా నాలుగు కాళ్లతో పుట్టే జీవికి అదనంగా నాలుగు కాళ్లు ఉండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పుట్టిన ఆ వింత గొర్రెపిల్ల కొద్దిసేపటికి చనిపోయింది.