VIDEO: 'కూటమికి కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేదు'
VZM: గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో కూటమి ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. కూటమి, కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఒకవైపు కొరతలేదని చెబుతూనే మరోవైపు ధరలు పెంచడం అన్యాయమన్నారు. సరైన గ్యాస్ సరఫరా లేక చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయని, వెంటనే సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.