సరపడా యూరియా అందించాలని డిమాండ్

VZM: రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందించాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్న పాలకుల మాటలు హాస్యాస్పదమని, గత మూడు నెలలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మునకాల శ్రీనివాస్, బాబ్టి పాల్గొన్నారు.